టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన జోడీ కట్టనుంది కీర్తి సురేష్. ‘గీత గోవిందం’ ఫేమ్ పరుశరామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కనున్న ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్గా కమిటైన కీర్తి ఈ చిత్రంలో బ్యాంక్ ఎంప్లాయిగా కనిపించనుందట. అందుకోసం బ్యాంకులకు సంబంధించిన రుణాలు.. వాయిదాలు..వడ్డీ రేట్లు.. వార్షిక లావాదేవీలు మొదలైన అంశాలను ఔపాసన పట్టే పనిలో పడిందట కీర్తి. బ్యాంక్ మోసాల బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథ ఉంటుందని.. మహేష్ బాబు ఒక […]
కీర్తిసురేశ్ తాజాగా నటిస్తున్న ‘మిస్ఇండియా’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారట. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్లో తెలియజేశాడు. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మరికొన్ని సాంగ్స్ సిద్ధమవుతున్నాయని తమన్ తెలిపారు.
అన్నీ బాగుంటే ఈపాటికి పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిపోయి ఉండేవాడు నితిన్. కానీ ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో యమ బిజీ అయిపోయాడు. ప్రజంట్ నితిన్ చేతిలో నాలుగు సినిమాల వరకూ ఉన్నాయి. కీర్తి సురేష్, నితిన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగ్దే’ మూవీ కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఈ సినిమా ఆగస్టు నుంచి తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారని సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ చెప్పాడు. చిత్రషూటింగ్ 70శాతం పూర్తయిందని, మిగిలిన 30శాతం […]
‘గీత గోవిందం’ ఫేమ్ పరుశురామ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు కాంబినేషన్లో ‘సర్కారు వారి పాట’ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్- 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఈ చిత్రం టైటిల్‌నే ఇంత ఫాసినేట్గా డిసైడ్ చేశారంటే క్యాస్టింగ్ విషయంలోనూ అలాగే ఉంటుందని అనుకున్నారంతా. అనుకున్నట్టుగానే హీరోయిన్ కోసం మొదట ‘భరత్ అను నేను’ ఫేమ్ కియారాను సంప్రదించారట. డేట్స్ కుదరని కారణంగా కియారా ఎస్ […]
‘సర్కార్‌వారి పాట’ చిత్రంలో మహేశ్‌బాబుతో కీర్తి సురేశ్ జతకట్టనున్నది. ఇన్‌స్టా లైవ్‌లో కీర్తీ సురేశ్ తన అభిమానులతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మహానటి సినిమాతో కీర్తి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఓటీటీలో సినిమాలు విడుదలవుతూ కొత్త ట్రెండ్స్ సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ‘మహానటి’ సినిమాతో టాప్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ సినిమా జూన్ 19న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా అంచనాలు పెంచేందుకు ఆదివారం చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేస్తోంది. మహానటి తర్వాత కీర్తిసురేష్ నటించిన చిత్రం ఇదే కావడంతో పెంగ్విన్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తోడు ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టోన్ […]