Breaking News

KANGTI

సీసీరోడ్డు పనులు షురూ

సారథి న్యూస్, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చాప్టా(బీ) పంచాయతీలో సీసీరోడ్డు పనులను సర్పంచ్ సాయవ్వ మనోహర్, ఎంపీటీసీ ఇందుమతి మారుతీ శనివారం ప్రారంభించారు. రూ.ఐదులక్షల వ్యయంతో 170మీటర్లు రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు వారు తెలిపారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్​ చేస్తామన్నారు. బాలాజీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Read More

నో మాస్క్​.. నో డిస్టెన్స్​

సారథి న్యూస్​, నారాయణఖేడ్​: వానాకాలంలో ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా.. రైతన్నలకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. నిన్న మొన్న వరుసగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ఫర్టిలైజర్​ షాపులు, అగ్రికల్చర్​ ఆఫీసుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంతో పాటు తడ్కల్ గ్రామంలో ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ సోయాబీన్ విత్తనాల కోసం […]

Read More

విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

సారథి న్యూస్​, కంగ్టి: విద్యుత్ షాక్ తో యువకుడు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని బాన్సువాడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోనాయి సాయిలు(42) దామర్ గిద్ద శివారులో చెరుకు పంటకు వేసిన విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. చెందినట్లు వారు పేర్కొన్నారు.భార్య అంజవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More