సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 26న(బుధవారం) ‘సాహితీ సౌరభం.. అసమాన దార్శనికత’ పేరుతో తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సమాలోచన సభ జరగనుంది. పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈ సభకు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించనున్నారు. రాజ్యసభ సభ్యుడు, ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు, పీవీ తనయుడు ప్రభాకర్ రావు, కూతురు వాణిదేవి, కవి అంపశయ్య నవీన్, రచయిత […]