సారథి, రామాయంపేట: డ్రమ్సీడర్తో రైతులకు ఎంతో ఉపయోగం ఉందని నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ అన్నారు. తద్వారా కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చని చెప్పారు. శనివారం ఆయన మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన రాజా కిషన్ డ్రమ్ సీడర్ ద్వారా రెండు ఎకరాల్లో వరి సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి సాగు కోసం డ్రమ్ సీడర్ వాడటం ద్వారా ఎకరానికి రూ.6000 నుంచి రూ.8000 వరకు ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. కూలీల సమస్య తగ్గుతుందని, పంటకాలం […]
సారథి, రామాయంపేట: గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పీఆర్సీని అమలు చేయాలని సీఐటీయూ నాయకులు వెంకట్ ఆధ్వర్యంలో నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీల్లో వివిధ కేటగిరీలకు సంబంధించిన కార్మికులకు 11వ పీఆర్సీని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. అందరికీ వెంటనే 30శాతం పీఆర్సీని అమలుచేయాలని, కనీసవేతనం రూ.18వేలు నిర్ణయించాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది జి.వెంకటేష్, నరేష్, ఎల్లం, రాములు, సుగుణ, రాజు, అనిల్, శ్రీశైలం పంచాయతీ సిబ్బంది […]