సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పల్లెచెరువు, మాదిగవాని కుంట, కొత్తచెరువు, పందిల్ల, అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి, మల్లంపల్లి, నక్కలకుంట, తాళ్లచెరువు, కొహెడ మండలంలోని బస్వాపూర్, శనిగరం, బెజ్జంకి మండలం బేగంపేట పాతచెరువు, దాచారం, బెజ్జంకి క్రాసింగ్, గుగ్గిళ్ల, ముత్తన్నపేట, మద్దూర్ మండల పరిధిలోని కుటిగల్, గాగిళ్లపూర్, బైరాన్పల్లి గ్రామాల్లోని పలు చెరువులు, కుంటలు నిండి […]