సారథిన్యూస్, గద్వాల: జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్నది. మహారాష్ట్రలో కొంతకాలంగా వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో గేట్లు ఎత్తివేశారు. జూరాలకు లక్ష 90 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. అధికారులు జూరాల ప్రాజెక్టులో25 గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 1,62,916 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జూరాలకు 1,90, 844 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం […]
సారథిన్యూస్, పాల్వంచ: కిన్నెరసాని రిజర్వాయర్లోకి భారీగా వరదనీరు వస్తున్నదని కేటీపీఎస్ 5,6 దశల సీఈ రవీంద్రకుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి గేట్లు ఎత్తి ఐదువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని చెప్పారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గేట్లు తెరిచిన సమయంలో కిన్నెరసాని వాగులో ఎలాంటి రాకపోకలు చేయవద్దని హెచ్చరించారు. కిన్నెరసాని రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.495 టీఎంసీల నీరు ఉన్నది. 10 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో […]