హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ షర్మిల వెంట నడవనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆమె లోటస్పాండ్లో వైఎస్ షర్మిలను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తాను పార్టీకి ఎంతో సేవ చేసినప్పటికీ తనకు సముచితస్థానం కల్పించలేదన్నారు. రాజన్న రాజ్యం కోసం తాను షర్మిల వెంట నడవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు, పార్టీలో […]