చెన్నై: కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఆయనకు ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ బాలుకయ్యే వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ ప్రకటించారు. బాలూ.. తొందరగా రా..బాలు ఆరోగ్యం విషమించినట్లు తెలియగానే మాస్ట్రో ఇళయరాజా కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. […]