సారథి న్యూస్, సూర్యాపేట: రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం చారిత్రాత్మకమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. రైతురాజ్యంలో ఇది నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని మఠంపల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తండ్రి దివంగత శానంపూడి అక్కిరెడ్డి స్మారకార్థం నిర్మించనున్న రైతువేదిక నిర్మాణాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ […]