సారథిన్యూస్, కొత్తగూడెం: కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించని ఓ హోటల్‌కు భారీ జరిమాన విధించిన ఘటన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. సోమవారం ఉదయం కలెక్టర్ ఎంవీ రెడ్డి జిలా కేంద్రంలోని హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ‘గుడ్‌మార్నింగ్’ అనే హోటల్లో సిబ్బంది కనీసం మాస్కులు కూడా ధరించకుండా తినుబండారాలు సప్లై చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్ హోటల్ యజమానికి రూ. 25వేలు జరిమానా విధించారు. నిబంధనలు పాటించకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.