సారథిన్యూస్, రామగుండం: తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కరోనా పేషంట్లకు సరైన వైద్యం అందడం లేదని వారు విమర్శించారు. శుక్రవారం పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంల్ న్యూడెమోక్రసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో కేవలం 88 మంది వైద్యసిబ్బంది మాత్రమే ఉన్నారని.. దీంతో రోగులకు సరైన వైద్యం అందించలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా […]