సారథి న్యూస్, హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి పాత బిల్డింగ్‌లోకి వరద నీరు వచ్చిచేరింది. వార్డుల్లోకి వర్షపు నీరంతా చేరడంతో చికిత్స పొందుతున్న రోగులంతా తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, ఆపరేషన్చేయించుకున్న మహిళలు ఎక్కడికి వెళ్లలేక నానా ఇబ్బందులు పడ్డారు. అధికారులు, ఆస్పత్రి సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని తోడివేయాల్సి వచ్చింది. ఈ ఘటన కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.