సారథి న్యూస్, హైదరాబాద్, అమరావతి: అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రెండు రోజులుగా మసురు పట్టింది. ఐదురోజుల పాటు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో అధికారులు హైఅలర్ట్ […]
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైని వానలు ముంచెత్తాయి. 10 గంటల్లోనే 23 సెం.మీ వర్షపాతం నమోదైంది. ముంబై, థానే, రాయ్‌గడ్, రత్నగిరి తదితర ప్రాంతాల్లో మోక్కాళ్ల లోతు వరకు నీరు వచ్చి చేరింది. దీంతో ముంబలో అధికారులు రెడ్ అలర్డ్ ప్రకటించారు. మరో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. వర్షాలకు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. నగరంలోని చాలా ప్రాంతాలకు బస్సులు, […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణీతో పాటు ఉత్తర బంగాళాఖాతంలో ఆగస్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంద్రా, యానాం తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది.