సారథిన్యూస్, రామడుగు: తమను ఆదుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్, కాలేజ్‌లో పనిచేస్తున్న అవర్లీ బేస్డ్ టీచర్లు (హెచ్‌బీటీ) శుక్రవారం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతిపత్రం సమర్పించారు. లాక్డౌన్ కాలం నుంచి జీతాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం నాయకులు ప్రశాంత్, శ్రీనివాస్, పూర్ణచందర్, గణపతి, సత్యానందం తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామడుగు: కరోనాతో పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకొనే పరిస్థితి లేనందున తమను ఆదుకోవాలని హెచ్‌బీటీ ( అవర్లీ బేస్డ్ టీచర్స్) కోరారు. మంగళవారం వారు చొప్పదండి ఎమ్మెల్యే సంకె రవిశంకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాలీ చాలని జీతాలతో బతుకు వెల్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌బీటీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సత్యానందం, రమేశ్, రమణ, జ్యోతి , అరుణ, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.