గురుగ్రహం లేదా శుక్ర గ్రహం కాని సూర్యుడితో కలసి ఉండే కాలాన్ని మౌఢ్యమి లేదా మూఢాలు అంటారు. మౌఢ్యకాలంలో గ్రహకిరణాలు భూమిపై ప్రసరించేందుకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్యకాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి. శుభగ్రహమైన శుక్రుడికి మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిద్ధం. మౌఢ్యమిని ‘మూఢమి’గా వాడుక భాషలో పిలుస్తారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యాలు చేయకూడదు. మూఢమి అంటే చీకటి అని అర్ధం. […]