బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రియా చక్రవర్తి 78 మంది పేర్లు చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఈ కేసులో రకుల్ ప్రీత్‌సింగ్, సారా అలీఖాన్, దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, నమ్రతా శిరోద్కర్ పేర్లు బయటకు వచ్చాయి. వీరందరికీ ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. శుక్రవారం రకుల్ ప్రీత్‌సింగ్ ఎన్సీబీ ( నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) ఎదుట హాజరైంది. మరోవైపు దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను శుక్రవారం ఎన్సీబీ ప్రశ్నించింది. ఆమె ఎన్సీబీకి […]