సారథి న్యూస్, కర్నూలు: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలుకు సమీపంలో ఉన్న గాజులదిన్నె ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో హంద్రీనీవా నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో నగరంలోని బుధవారంపేట, జోహారపురం, బాపూజీ నగర్, జమ్మిచెట్టు తదితర ప్రాంతాల్లోని లోతట్టు కాలనీ జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. […]