మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి సారథి, వెల్దండ: దేశవ్యాప్తంగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ పాలనకు స్వప్తి పలకాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం పెట్రోల్, డీజిల్ అధిక ధరల పెంపునకు నిరసనగా ఏఐసీసీ పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఎం.మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. […]