సామాజిక సారథి, వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(డీ82) కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా చెరుకూరు, పరిసర గ్రామాల బాధిత రైతులు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో భాగంగా చెరుకూరు, భర్కత్ పల్లి, గానుగట్టుతండా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెరుకూరు సర్పంచ్ రేవతి రాజశేఖర్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వం భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని […]