ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ న్యూఢిల్లీ: ఇంగ్లండ్ క్రికెట్ బాగా అభివృద్ధి చెందడానికి ఐపీఎల్ చాలా దోహదపడిందని ఆ దేశ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ అన్నాడు. ఐసీసీ ప్రపంచకప్‌ల తర్వాత ఐపీఎల్ బెస్ట్ టోర్నీ అని కితాబిచ్చాడు. ఈసారి లీగ్ జరిగితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘ఇంగ్లిష్ క్రికెట్ పురోగతి సాధించడానికి ఐపీఎల్ చాలా సాయం చేసింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కొన్నేళ్లుగా ఎంతో మంది క్రికెటర్లు ఇందులో ఆడుతున్నారు. వాళ్లంతా ఆటపరంగా, ఆర్థికంగా చాలా […]