సామాజిక సారథి, నార్కెట్ పల్లి: ముందు వెళుతున్న లారీని డీసీఎం ఢీకొట్టడంతో, క్యాబిన్లో ఇరుక్కుని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో సోమవారం రాత్రి జరిగింది. నెల్లూరు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన చుండి హర్షవర్ధన్ రెడ్డి(30) సూర్యాపేట నుంచి హైదరాబాద్ కు డీసీఎంలో ప్రయాణిస్తున్నాడు. నార్కెట్ పల్లి గ్రామ శివారులోని నల్లగొండ ఫ్లై ఓవర్ దగ్గరకు రాగానే అతివేగం, డ్రైవర్ అజాగ్రత్తతో ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. […]