సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం జంగరాయ్ గ్రామంలో దుర్గామాత పాపమ్మ ఆలయ ఏడవ వార్షికోత్సవాలను రెండు రోజులు నిర్వహించనున్నట్లు సర్పంచ్ బందెల జ్యోతి ప్రభాకర్, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల్లో మొదటిరోజు చండీహోమం, కుంకుమార్చన, పుష్పార్చన తో పాటు శనివారం అన్నదానం, పూజ బోనాలు నిర్వహిస్తారు. మండల ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు కోరారు.
సారథి న్యూస్, నిజాంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ ఆలయంలో ఆదివారం దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీనవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పురోహితులు వేలేటి లక్ష్మణశాస్త్రి మాట్లాడుతూ..కరోనా నేపథ్యంలో దుర్గామాత కమిటీ సభ్యులంతా భౌతికదూరం పాటిస్తూనే మాస్కులు కట్టుకుని అమ్మవారి సేవకు అంకితమయ్యారని తెలిపారు. గ్రామస్తుంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.