కోల్‌కతా : కరోనా వైరస్‌తో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతుంటే.. ఇదే అవకాశంగా తీసుకుని జేబులు నింపుకుంటున్నారు. కోల్‌కతాలో ఆరు కి.మీ.దూరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఓ అంబులెన్స్ డ్రైవర్ రూ.9200 డిమాండ్ చేశాడు. అంతమొత్తం చెల్లించలేమని చెప్పిన ఇద్దరు కరోనా పాజిటివ్‌గా తేలిన బాలురు, వారి తల్లిని అర్ధంతరంగా వాహనం నుంచి దిగిపొమ్మని చెప్పాడు. వైద్యులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు రూ.2,000 తీసుకునేందుకు అంగీకరించాడు. కోవిడ్-19గా నిర్ధారణ కావడంతో సోదరులైన ఇద్దరు బాలురు శుక్రవారం […]
బాలీవుడ్ స్టార్హీరో సైఫ్ అలీఖాన్ కూతురు, నటి సారా అలీఖాన్ డ్రైవర్‌కు కరోనా సోకింది. దీంతో సైఫ్అలీఖాన్ కుటుంబసభ్యులు భయందోళనకు గురయ్యారు. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోగా వారందరికీ నెగెటివ్ వచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని నేరుగా సారా ట్వట్టర్ ద్వారా తెలియజేశారు. మరోవైపు ముంబైలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. రోజుకు వేలల్లో కొత్త కేసులు బయటపడుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యలకు కరోనా వైరస్ సోకింది. ఈ […]
సారథి న్యూస్, రంగారెడ్డి: కరోనా లక్షణాలతో ఉన్న ఓ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరో 58 మంది హమాలీ కార్మికులను హోమ్ క్వారంటైన్ కు పంపించారు. రాజస్థాన్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు గన్నీ బ్యాగ్స్ లోడ్ తో వచ్చిన లారీలో ఎక్కిన ఓ ప్రయణికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు ప్రయాణించిన లారీ విషయమై పోలీసులు ఆరా తీయగా వలిగొండ లో ఉన్నట్లు గుర్తించి డ్రైవర్, క్లీనర్లను రంగారెడ్డి జిల్లా రావిరాల […]