Breaking News

DHARNA

జూలై 3న మహాధర్నా

సారథిన్యూస్​, కోదాడ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 3న తలపెట్టిన ఐక్య కార్మిక సంఘాల ధర్నాను జయప్రదం చేయాలని కార్మికసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఐక్యకార్మిక సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఉదయగిరి, ఐఎన్టీయూసీ నాయకులు కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం

సారథిన్యూస్​, గోదావరిఖని: కేంద్రప్రభుత్వం పెట్రోలు, డీజిల్​ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని వామపక్ష నాయకులు ఆరోపించారు. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కరోనాను అరికట్టడంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య , సీపీఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నరేశ్​, వామపక్ష నాయకులు తోకల రమేశ్​, మహేశ్వరీ, లావణ్య, ఫైముదా, పీర్ మహ్మద్, మోగిలి, ఎం దుర్గయ్య, […]

Read More

పెట్రోధరలు తగ్గించండి

సారథి న్యూస్, హుస్నాబాద్: పెంచిన పెట్రోధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి డిమాండ్​ చేశారు. కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా అంతకంతకూ పెరుగుతున్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా ప్రజారోగ్యాన్ని గాలికొదిలాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 25న సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఎడ్ల వెంకట్రామిరెడ్డి, సీపీఐ జిల్లా […]

Read More