Breaking News

DEVARAKADRA

పత్తిరైతు కన్నీరు

పత్తిరైతు కన్నీరు

సారథి న్యూస్, దేవరకద్ర: ఈ ఏడాది కాలం కలిసొచ్చిందనుకుంటే ముసురు వర్షం రైతులను కన్నీరు పెట్టిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలంలోని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు పత్తి పొలాల్లోకి విపరీతంగా నీరు వచ్చిచేరింది. దీంతో పంటంతా ఊట ఎక్కుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దేవరకద్ర మండలంలో ఈ ఏడాది సుమారు 11వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు. మండలంలోని గోపనపల్లి, పుట్టపల్లి, కౌకుంట్ల, రాజోలి, వెంకటగిరి, వెంకంపల్లి […]

Read More

బండరపల్లి చెక్​డ్యాంకు జలకళ

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండర్​పల్లి చెక్​డ్యాం అలుగు పారుతోంది. బండర్​పల్లి వంతెనను గతేడాది మంత్రి టి.హరీశ్​రావు చొరవతో చెక్​డ్యాంగా నిర్మించారు. కాగా, కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పెద్దఎత్తున నీరు చేరి అలుగు పారుతోంది. చెక్ డ్యాం నిండడంతో పరిసర గ్రామల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్​డ్యాంకు నిధులు మంజూరు చేసిన మంత్రి టి.హరీశ్​రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Read More
నిండుకుండలా కోయిల్ సాగర్

నిండుకుండలా కోయిల్ సాగర్

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ ​జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ నిండుకుండలా మారింది.. భారీవర్షాలకు జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం నీటిమట్టం 30 ఫీట్లకు చేరింది. కోయిల్​సాగర్ ప్రాజెక్టును 1954 లో నిర్మించారు. అప్పటి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కేఎం ఖర్జూ ప్రాజెక్టును ప్రారంభించి మొట్టమొదటిసారిగా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టును అప్పట్లో కేవలం వర్షాధారం ప్రాతిపదికగానే 12వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా నిర్మించారు. ఆ తర్వాత ఎత్తిపోతల పథకంగా మార్చారు. ఇక్కడి నుంచి […]

Read More