సారథి న్యూస్, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సర్వేనం.363లో ఉన్న దళితుల భూమిని కబ్జాదారులు అక్రమంగా పట్టా చేయించుకుని వారిపైనే అక్రమ కేసులు బనాయించడం దారుణమని కేవీపీఎస్రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంతటి కాశన్న అన్నారు. గురువారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో స్థానిక సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. 1957లో దళితులకు ఇచ్చిన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా పట్టాలు చేయించుకోవడమే కాకుండా ఆ […]