ప్రముఖ నటుడు రానా, మిహీకాల పెళ్లి శనివారం రాత్రి రామానాయూడు స్టూడియోలో నిరాడంబరంగా జరిగింది. కరోనా నేపథ్యంలో కేవలం కొద్దిమంది బంధుమిత్రలు సమక్షంలో వివాహవేడకను నిర్వహించారు. శనివారం రాత్రి 8.30 గంటలకు రానా, మిహికా జంట ఒక్కటయ్యారు. గత మే నెలలో తాను మిహీకా బజాజ్ ప్రేమించుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించడంలో వివాహం ఖాయమైంది.