సారథి, రామడుగు: క్రీడలు మానసిక వికాస అభివృద్ధికి తోడ్పడుతాయని సర్పంచ్ పంజాల ప్రమీల అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని గడికోట క్రీడామైదానంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ గురువారం నిర్వహించారు. క్రీడలు వ్యక్తి మానసిక పరిపక్వతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారుడు స్నేహభావంతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, ఉపసర్పంచ్ వడ్లూరి రాజేందర్, కార్యదర్శి మధుసూదన్, మాజీ సర్పంచ్ పంజాల జగన్ మోహన్, మాజీవార్డు సభ్యులు ఐతరవేని […]