నడియాడ్: ఎదురెదురుగా వస్తున్న రెండుకార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పయారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్-వడోదర 8వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నడియాడ్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు అగ్నిమాపకశాఖ సూపరింటెండెంట్ దీక్షిత్ పటేల్ తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.