సారథి న్యూస్, రామయంపేట: ప్రతి గ్రామంలో రైతులు వేసిన పంటలను నమోదు చేయించుకోవాలని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీష్ సూచించారు. శనివారం మండలంలోని నందిగామ గ్రామంలో పంటల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. పంట గణన ప్రక్రియ పక్కాగా ఉండాలన్నారు. రైతుల నుంచి సేకరించిన వివరాలను ఎప్పకప్పుడు ఆన్లైన్లో అప్లోడ్చేయాలని సూచించారు. ఆయన వెంట ఏఈవో దివ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సంపత్, రాజగోపాల్ ఉన్నారు.