సారథి న్యూస్, కర్నూలు: దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తితో ముందుకెళ్లాలని కర్నూలు నగర పాలకసంస్థ కమిషనర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక నగర పాలకసంస్థ ఆఫీసులో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. మొదట సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన కమిషనర్ బాలాజీ అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. క్విట్ ఇండియా పోరాటం తరహాలో నేడు ప్రస్తుత కరోనా విపత్తు సమయంలోనూ పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు […]