తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా టీచర్ను ఐక్యరాజ్య సమితి వక్తగా ఆహ్వానించింది. కోవిడ్–19ను సమర్థవంతంగా ప్రతిఘటించినందుకు యూఎన్వో(యునైటెడ్ నేషన్స్ఆర్గనైజెషన్) నిర్వహించే ప్రజాసేవా దినోత్సవంలో ఆమె ప్రసంగించనున్నారు. కరోనాపై యుద్ధంలో సీపీఎం నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఆ చర్యలను ప్రపంచదేశాలకు మంత్రి వివరించనున్నారు.