సామాజిక సారథి, తలకొండపల్లి: రైతు సంఘం మండల నూతన కమిటీ ఎన్నికైనట్లు రంగారెడ్డి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అరిగోసపెట్టుతున్నాయని ఆరోపించారు. అధ్యక్షులుగా పిప్పల్ల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా శివగల రమేష్, ఉపాధ్యక్షులుగా వెంకట్ రెడ్డి, కృష్ణయ్య సహాయ కార్యదర్శులుగా , మల్లేష్, జంగయ్య, పర్వతాలను ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలలో రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యులు […]
సామాజిక సారథి, తిమ్మాజిపేట: మండలంలోని నీలగిరిలో ముదిరాజ్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు కావలి లక్ష్మయ్య తెలిపారు. కమిటీ అధ్యక్షుడిగా రమేష్, ఉపాధ్యక్షుడిగా అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా సుంకరి రాజు, గౌరవ అధ్యక్షుడిగా చెన్నకేశవులు, కోశాధికారిగా అంజయ్య, ప్రచార కార్యదర్శిగా బాలస్వామితో పాటు మరో 8 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు.