కార్మికుల సమ్మె సక్సెస్ మూడోరోజూ కొనసాగిన నిరసనలు కార్మిక సంఘాల బైక్‌ర్యాలీ నిలిచిన 6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి బొగ్గు గనులపై కేంద్రం కుట్ర: ప్రభుత్వ విప్బాల్క సుమన్ సామాజిక సారథి, కరీంనగర్: బొగ్గుగనుల ప్రైవేటీకీకరణకు వ్యతిరేకంగా చేపట్టిని సింగరేణి సమ్మె సక్సెస్అయింది. శనివారం మూడో రోజుకు చేరింది. సిగరేణివ్యాప్తంగా కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో ఆరు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. మొత్తం 23 భూగర్భగనులు, 16 ఓపెన్ కాస్ట్ గనుల్లో సమ్మె విజయవంతమైంది. […]
బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన సింగరేణి ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు సామాజిక సారథి, భద్రాద్రికొత్తగూడెం: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 9,10,11 తేదీల్లో జరిగే సమ్మెలో పాల్గొనాలని సింగరేణి కార్మికులకు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. టీబీజీకేఎస్ నేత కోటా శ్రీనివాస్ అధ్యక్షతన ఓసీ2లో జరిగిన ఫిట్ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వి.ప్రభాకర్‌రావు, ఏఐటీయూసీ నేత రామ్‌గోపాల్, ఐఎన్‌టీయూసీ నాయకుడు వెలగపల్లి జాన్, […]
సారథిన్యూస్, రామగుండం: సింగరేణిలోని బొగ్గును దొంగిలించనవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ పేర్కొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో సింగరేణిలో తరుచుగా బొగ్గును దొంగిలిస్తున్న దుస్స దేవేందర్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం సదరు నిందితుడిపై కేసునమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
సారథిన్యూస్, గోదావరిఖని: బొగ్గును విక్రయించేందుకు సింగరేణి సంస్థ ప్రత్యేకపోర్టల్ను ప్రారంభించింది. విదేశీ బొగ్గు దిగుమతికి బదులుగా స్వదేశీ బొగ్గు వినియోగం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు అధికారిక వెబ్సైట్లో ఓ ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించినట్టు సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్, ప్రాజెక్ట్స్) భాస్కర్‌రావు, ఆపరేషన్స్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పోర్టల్ కు సంబంధించిన వివరాల కోసం www.scclmines.com వెబ్‌సైట్‌ను కానీ 040-23142219 నంబర్ లో కానీ సంప్రదించాలని కోరారు. సింగరేణి సంస్థ వినియోగదారుల అభీష్టం మేరకు […]