సెప్టెంబర్ 1 నుంచి బియ్యం డోర్ డెలివరీ ఏపీ సీఎం వైఎస్‌జగన్ ఆదేశాలు సారథి న్యూస్, అనంతపురం: ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్‌డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. కరోనా(కోవిడ్–19) నివారణ చర్యలపై సమీక్షలో భాగంగా పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. […]