సారథి న్యూస్, హైదరాబాద్: పర్యాటక స్థలాల్లో సినిమా షూటింగ్ లు జరుపుకునేందుకు వీలుగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సింగిల్‌విండో పాలసీని తీసుకొస్తున్నట్టు మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. ఫారెస్ట్ కార్పొరేషన్, టూరిజం శాఖల పూర్తి సహకారం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సహజంగా ఏర్పడిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయన్నారు. సోమవారం పలువురు సినీ డైరెక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొండలు, గుట్టలు, కోటలు, రిజర్వాయర్లు, బోటింగ్, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు, అడవులు, ఎకో […]