Breaking News

CHITTOR

లారీ బోల్తా.. నలుగురి మృతి

చిత్తూరు: లారీ బోల్తాపడడంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గం పీటీయం మండలం కర్ణాటక సరిహద్దు ప్రాంతం చేలూరు వద్ద బుధవారం చోటుచేసుకుంది. కర్ణాటకలోని చేలూరు సమీపంలోని పాలసముద్రం వద్ద రైతు పొలంలో బోరు వేసేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యంలో లారీ వేగం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.

Read More