సారథి న్యూస్, మెదక్: రైతులు పండించిన ధాన్యంలో తేమ లేకుండా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మెదక్జిల్లా కలెక్టర్ఎం.హనుమంతరావు సూచించారు. సోమవారం సాయంత్రం చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి వద్ద రోడ్డుపై వడ్లను ఆరబోసిన రైతులను చూసి తన వాహనాన్ని ఆపి వారితో మాట్లాడారు. ప్రస్తుతం కొన్నిచోట్ల వరి నూర్పిడి పూర్తయిందని, అయితే అకాల వర్షాలు కురవడంతో వడ్లను రోడ్డుపై ఎండబెట్టామని రైతులు వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ సూచన మేరకు ఆదివారం చిన్నశంకరంపేట బీజేపీ మండల కమిటీతోపాటు మోర్చా అధ్యక్షుల కమిటీని నియమించినట్లు మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి తెలిపారు. ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దత్త, ప్రకాష్ హాజరయ్యారు. నరేందర్, దశరథ్, ప్రధాన కార్యదర్శులుగా పెంటాగౌడ్, మేడిస్వామి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, గోపాల్ లు ఉపాధ్యక్షుడిగా వడ్ల సిద్ధిరాములు, సంతోష్ రెడ్డి, సురేష్, కార్యదర్శులుగా బాలసుబ్రమణ్యం కోశాధికారిగా ఎంపికయ్యారు.