సామాజిక సారథి, వైరా: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు, సేవలందించడంలో ఉద్యానవన శాఖ విఫలమైందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు ఆరోపించారు. వైరా మండలంలోని పలు గ్రామాల్లో రైతు సంఘం బృందం వైరస్ సోకిన మిర్చి తోటలను గురువారం పరిశీలించింది. పలువురు రైతులు వైరస్ తో దెబ్బతిన్న మిర్చి తోటలను ఈ బృందానికి చూపించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మిర్చి సాగులో 50శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, […]