సారథి న్యూస్, మెదక్: కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడం, టెస్టుల కోసం హైదరాబాద్ వెళ్లడం ఇబ్బందికరంగా మారడంతో మెదక్‌లోనే కోవిడ్–19 టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్టు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి వెల్లడించారు. మెదక్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ల్యాబ్‌ను శుక్రవారం ఆమె కలెక్టర్ ఎం.ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. మెదక్ జిల్లా ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో పట్టణంలోనే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎవరికైనా […]