Breaking News

CARONA

ప్రభుత్వానికి ‘జైభీమ్​యూత్’​ విజ్ఞప్తి

ప్రభుత్వానికి ‘జైభీమ్​ యూత్’​ విజ్ఞప్తి

సారథి, హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికిస్తున్న కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ అన్ని కార్పొరేట్​ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందించాలని జైభీమ్​యూత్​ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా సెకండ్​వేవ్​తీవ్రతలో జనం పిట్టల్లా రాలిపోతున్నారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వెంటివేషన్​సరిపడా దొరకడం లేదని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో కొవిడ్​రోగుల ప్రాణాలు నిలిపే రెమిడెసివర్​ఇంజక్షన్ల కొరత తీవ్రత ఉందని, బ్లాక్ మార్కెట్​ దందాపై ఉక్కుపాదం […]

Read More
ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్

ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్

సారథి, హైదరాబాద్: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఏప్రిల్ 19న ఆయనకు కరోనా అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన గజ్వేల్‌లోని తన ఫాంహౌజ్‌లోనే ఐసోలేషన్‌లో ఉండిపోయారు. 28న ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో వైద్యులు ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా, నెగెటివ్ అని వచ్చింది. 29న ఆర్టీపీసీఆర్‌లో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చివరికి మే 4న  కరోనా నుంచి సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారని వ్యక్తిగత వైద్యులు ధ్రువీకరించారు. […]

Read More
కరోనాతో సర్పంచ్ మృతి

కరోనాతో సర్పంచ్ మృతి

సారథి, రామాయంపేట: కరోనా బారినపడి మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామ సర్పంచ్ కర్రెయ్య(63) చనిపోయారు. కొవిడ్​ నిర్ధారణ కావడంతో రామయంపేటలోని ఐసొలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రతిరోజూ ఉదయం టీవీఎస్ మోటార్ సైకిల్ పై గ్రామంలో వాడవాడలా తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకునే వాడని గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More
కరోనా థర్డ్​వేవ్​ముప్పు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

కరోనా థర్డ్​వేవ్​ ముప్పు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సెకండ్​ వేవ్ ​విరుచుపడుతోంది. వైరస్​ తన రూపాంతరాన్ని మార్చుకుంటోంది. ఎంతో మందిని బలితీసుకుంటోంది. ఈ తరుణంలో థర్డ్​వేవ్ ​ముప్పు కూడా తప్పదన్న సైంటిస్టులు, వైద్యనిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రతిఒక్కరిలోనూ మరింత భయాందోళన మొదలైంది. విపత్తు ఎలా విరుచుకుపడుతుందోనన్న కలవరం నెలకొంది. దేశంలో కొవిడ్ అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కొనేందుకు టీకాలపై పరిశోధనలను పెంచాలని కేంద్రప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు విజయరాఘవన్ సైతం హెచ్చరించారు. కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌ ను అప్​ […]

Read More
ఈఎంఐలు కడుతున్నారా.. కొంత ఊరట!

ఈఎంఐలు కడుతున్నారా.. కొంత ఊరట!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కొవిడ్ 19 దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూల వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రైవేట్​ ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపాయి. చాలా మంది ఉపాధి లేక రోడ్డునపడుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బ్యాంకులు రుణ గ్రహీతలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకోనున్నాయి. లోన్ ఈఎంఐ చెల్లింపుల పట్ల కొంత గడువు ఇచ్చే విషయాన్ని ఆర్​బీఐకి ఆయా బ్యాంకులు తెలియజేశాయి. లోన్లు తీసుకున్నవారికి మరో మూడునెలల […]

Read More
కరోనా ఉందని తప్పుడు రిపోర్టు

కరోనా ఉందని తప్పుడు రిపోర్టు

ఆస్పత్రిపై కేసు నమోదు సారథి, వేములవాడ: కరోనా టెస్టుల్లో తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు వేములవాడ పట్టణంలోని మాతృశ్రీ కొవిడ్ ఆస్పత్రిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పట్టణ సీఐ వెంకటేశ్​ తెలిపారు. పోలీసుల కథనం.. చిట్టి మంగమ్మ అనే మహిళ స్వల్ప జ్వరం లక్షణాలతో మాతృశ్రీ ఆస్పత్రిలో వైద్యం కోసం చేరింది. డాక్టర్లు ఆమెను పరీక్షించి సీటీస్కాన్, రక్తపరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిందని ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని ఆమెకు సూచించారు. సుమారు రూ.1.5లక్షలు […]

Read More
కరోనా, వేములవాడ, సెకండ్​వేవ్​, carona, vemulawada,

కరోనాతో టీచర్​ మృతి

సారథి, వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుమ్మడి ప్రకాశ్ (45)అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి. టీచర్​ గా ప్రకాశ్​ అందించిన సేవలను తోటి ఉపాధ్యాయులు, టీచర్లు కొనియాడారు.

Read More
యువకుడిని బలితీసుకున్న కరోనా

యువకుడిని బలితీసుకున్న కరోనా

సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ యువకులను ఎక్కువగా బలి తీసుకుంటోంది. తాజాగా కరీంనగర్​జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన నీలం రాజు (34) అనే యువకుడు కరోనాతో మృతిచెందాడు. కొద్దిరోజులుగా కరోనాతో పోరాడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. మృతుడికి అమ్మ నాన్న, తమ్ముడు, చెల్లి ఉన్నారు. తాను పెళ్లి చేసుకోకుండా కుటుంబభారాన్ని మోస్తున్నాడు. తమ కొడుకు లేడన్న నిజాన్ని తెలుసుకుని రాజు తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తుండగా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు. నీలం రాజు […]

Read More