Breaking News

CARONA

దేశంలో భారీగా పెరుగుతున్న కేసులు

52 వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 52,123 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా 64.4 శాతం రికవరీ రేటు ఉన్నదని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 10,20,582 మంది కరోనా నుంచి కోలుకోగా.. కేవలం గత 24 గంటల్లోనే 32,553 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి 34, 968 మంది పొట్టనబెట్టుకున్నది. 5,28,242 యాక్టివ్​ కేసులున్నాయి.

Read More
తెలంగాణలో 1,811 పాజిటివ్ కేసులు

తెలంగాణలో 1,811 పాజిటివ్ కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గురువారం కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి 60,717 కేసుల నిర్ధారణ అయ్యాయి. ఒకేరోజు 13 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 505 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 521 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 289 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​18, భద్రాద్రి కొత్తగూడెం 27, జగిత్యాల 15, జనగాం 22, జయశంకర్​భూపాలపల్లి 20, జోగుళాంబ […]

Read More
బకాయి జీతం వస్తలేదు

బకాయి జీతం వస్తలేదు

కూలి పనులకు వెళ్తున్న విద్యావలంటీర్లు కరోనా ప్రభావంతో బతుకులు ఆగమాగం పెండింగ్ జీతాలైనా ఇవ్వండని వేడుకోలు :: సుంకే కుమార్,​ కౌడిపల్లికరోనా మహమ్మారి మధ్యతరగతి ప్రజల జీవనంపై దెబ్బకొట్టింది. ఓ వైపు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూ.. మరోవైపు ప్రాణాలను హరించేస్తోంది. ఎంతో మంది తమ జీవనోపాధిని కోల్పోయి బతుకుజీవుడా అని కాలం వెళ్లదీస్తున్నారు. నెలవారి జీతంతో బతికే కుటుంబాల పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడింది. కరోనా పుణ్యమా! అని ఉన్నత చదువులు చదివిన విద్యావలంటీర్లు రోజువారీ […]

Read More
ప్రముఖ దర్శకుడు రాజమఃలికి కరోనా

దర్శకుడు రాజమౌళికి కరోనా

సారథి న్యూస్​, హైదరాబాద్‌: సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్​ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకినట్టు సమాచారం. ‘నేను, నా కుటుంబసభ్యులు కొద్ది రోజులుగా తేలికపాటి జ్వరంతో బాధపడ్డాం. అయితే ఆ తర్వాత జ్వరం తగ్గిపోయింది. కానీ మేము కరోనా టెస్ట్‌ చేయించుకున్నాం. మాకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. […]

Read More

వోడ్కా తీసుకోండి.. కరోనాను జయించండి

కరోనా విపత్తువేళ రాజకీయనాయకులు నోటికొచ్చినట్టు ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బెలారస్​ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్​ లుకాషెంకో ఓ సంచలన ప్రకటన చేశాడు. ప్రతి ఒక్కరూ రోజూ 50 ఎంఎల్​ వోడ్కా తీసుకుంటే కరోనా మన గొంతులోనే చనిపోతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అతడి సూచనపై సోషల్​మీడియాలో ఓ రేంజ్​లో ట్రోలింగ్ నడుస్తోంది. తనకు కరోనా సోకిందని.. తాను రోజు వోడ్కా తాగి కరోనాను జయించానని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ ను నిర్మూలించాలంటే వోడ్కాకు మించిన డ్రగ్ […]

Read More
​ తెలంగాణలో 1,764 కరోనా కేసులు

తెలంగాణలో 1,764 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్​:​ తెలంగాణలో బుధవారం 1,764 కరోనా కేసులు నమోదయ్యాయి. 12 మంది చనిపోయారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,906కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 43,751 మంది డిశ్చార్జ్​ కాగా, 492 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,663 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. 9,178 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 15, భద్రాద్రి 30, హైదరాబాద్ 509, […]

Read More
కరోనా పేషెంట్ల కోసం హాస్పిటల్.. భేష్​

కరోనా పేషెంట్ల కోసం హాస్పిటల్.. భేష్​

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా పేషెంట్ల కోసమే ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి తన్నీరు హరీశ్​రావు అన్నారు. బుధవారం హైదరాబాద్​లోని మాదాపూర్​లో సిగ్మా హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో నిష్ణాతులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లు కోసమే ప్రత్యేకంగా హాస్పిటల్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగంగా […]

Read More
ఆగస్టు 14వరకు లాక్డౌన్

ఆగస్టు 14 వరకు లాక్​డౌన్​

సారథి న్యూస్​, కోదాడ : పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా ఈ నెల 31నుంచి ఆగస్టు 14వరకు లాక్​డౌన్​ విధించనున్నట్లు కోదాడ మున్సిపల్​ కమిషనర్​ మల్లారెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. వైరస్​ను కట్టడి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్​, రెవెన్యూ, పోలీసుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సేవలకు, మెడికల్​ షాపులకు లాక్​ డౌన్​ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ15రోజులపాటు స్వీయ నిర్బంధం పాటించాలని కమిషనర్​ […]

Read More