Breaking News

CARONA

గంగవ్వకు కరోనా టెస్ట్​.. హౌస్​లో కలకలం

సారథిన్యూస్​, హైదరాబాద్​: బిగ్​బాస్​ హౌస్​లో పనిచేస్తున్న కొంతమంది టెక్నిషియన్లకు కరోనా సోకినట్టు సమాచారం. దీంతో బిగ్​బాస్​ హౌస్​ నిర్వాహకుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. అయితే గత హౌస్​లో అత్యధిక ఓట్లతో దూసుకుపోతున్న గంగవ్వకు కూడా రెండ్రోజులుగా అనారోగ్యంగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఆమె నేరుగా బిగ్​బాస్​కే చేప్పేశారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన బిగ్​బాస్​ టీం వెంటనే గంగవ్వకు కరోనా టెస్టు చేయించినట్టు సమాచారం. శుక్రవారం ఉదయమే ఆమె నుంచి శాంపిల్లు తీసుకున్నారట. అయితే ఆమెకు […]

Read More
వెయ్యి దాటిన కరోనా మరణాలు

వెయ్యి దాటిన కరోనా మరణాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. వెయ్యి మందిని బలితీసుకుంది. ఈ క్రమంలో గురువారం రాష్ట్రంలో (24 గంటల్లో) 2,159 పాజిటివ్ ​కేసులు నమోదయ్యాయి. వ్యాధి బారినపడి తాజాగా 9 మంది మృతిచెందారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో 1,005 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,65,003కు చేరింది. తాజాగా వ్యాధి నుంచి 2,108 మంది కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,33,555కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,443 యాక్టివ్​కేసులు […]

Read More

కరోనా టెస్టులు చేయించుకోండి

సారథి న్యూస్​, నారాయణఖేడ్​: లక్షణాలు ఉన్నవాళ్లందరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మెదక్​ జిల్లా కంగ్టి పీహెచ్​సీ డాక్టర్​ మనోహర్​రెడ్డి సూచించారు. మండలంలో రోజురోజుకూ కరోనా పెరుగుతున్నదని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. భౌతికదూరం పాటించాలని సూచించారు. బుధవారం కంగ్టి పీహెచ్​సీలో కరోనా పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్​ గా​ నిర్ధారణ అయింది. వారందరినీ క్వారంటైన్​లో ఉండాలని ఆయన సూచించారు.

Read More
తెలంగాణలో 1.60లక్షలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో 1.60లక్షలు దాటిన కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో మంగళవారం (24గంటల్లో) 2,058 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 1.60లక్షలు దాటాయి. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 984కు చేరింది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1,60,571 గా నిర్ధారణ అయింది. జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 277 కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు 51,247 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో 2,180 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు […]

Read More
‘మేము’న్నాం..

‘మేము’న్నాం..

సారథి న్యూస్​, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేటలో సోమవారం ‘మేము’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా రోగులకు సాయం అందించారు. కరోనా బాధితుడి కుటుంబానికి 20 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థఫౌండర్ పాకాల మహేశ్​గౌడ్, సభ్యులు కల్లేపల్లి లక్ష్మణ్, ముదుగంటి సురేశ్​, వెంకటరమణ, ఉపసర్పంచ్ సింగిరెడ్డి వెంకట్ రామ్ రెడ్డి, మహిపాల్, గంగస్వామి పాల్గొన్నారు.

Read More
తెలంగాణలో 1,417 కరోనా కేసులు

తెలంగాణలో 1,417 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) 1,417 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,153కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 13 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 974కు చేరింది. ఒకేరోజు 34,426 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ట్రీట్​మెంట్​అనంతరం ఒకేరోజు 2,479 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 1,27,007 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,532 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్ లో మరో 23,639 […]

Read More
కరోనా కొత్త రికార్డు

కరోనా కొత్త రికార్డు

14 రోజులు.. 12 ల‌క్షల కేసులు.. 15వేల చావులు భార‌త్‌లో కరోనా ఉగ్రరూపం.. మ‌ర‌ణాలు 79 వేలు 48 ల‌క్షలు దాటిన పాజిటివ్ కేసులు న్యూఢిల్లీ : రోజులు గ‌డుస్తున్న కొద్దీ భార‌త్‌లో క‌రోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న దేశాల్లో ప్రపంచ దేశాల‌ను దాటుకుని రెండోస్థానానికి ఎగ‌బాకిన భార‌త్‌.. రోజూవారీ కేసులు, మ‌ర‌ణాల‌లోనూ ముందే ఉండ‌డం ఆందోళ‌న‌క‌రమైన అంశం. గ‌త 50రోజులుగా వైర‌స్ వ్యాప్తి ప‌ట్టప‌గ్గాల్లేకుండా పోతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుద‌ల చేసిన […]

Read More
ఇజ్రాయిల్‌లో మ‌ళ్లీ లాక్‌డౌన్

ఇజ్రాయిల్‌లో మ‌ళ్లీ లాక్‌డౌన్

జెరూస‌లేం: క‌రోనా వ‌చ్చిన కొత్తలో.. దాని వ్యాప్తిని నివారించ‌డానికి అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించాయి. అయితే దీని కార‌ణంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో దాదాపు ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. అయితే ఇజ్రాయిల్‌లో మాత్రం మ‌ళ్లీ మూడువారాల పాటు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఇజ్రాయిల్‌లో నానాటికీ క‌రోనా కేసులు ఎక్కువ‌వుతుండ‌ంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల వెల్లడించాయి. ఈ లాక్‌డౌన్ శుక్రవారం నుంచి అమ‌ల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.

Read More