చిత్తరంజన్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ రెండో క్యాంపస్ వీడియో కాన్ఫరెన్స్ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ కోల్‌కతా: దేశంలోని ప్రతి పౌరుడికి అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేసే దిశగా మరో అడుగు వేశామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. తద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు, ఎవరైనా కేన్సర్‌తో పోరాడుతున్న వారికి ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడంతో దేశం ఈ సంవత్సరాన్ని ప్రారంభించిందని ప్రధాని మోడీ అన్నారు. అదే సమయంలో ఈ ఏడాది […]
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు ఉపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. కాగా సంజయ్ మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్లనున్నట్టు సమచారం. ఆయన ప్రస్తుతం కేజీఎఫ్ 2, శమ్‌షేరా తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. సంజయ్ నటించిన కొన్ని వెబ్‌సీరిస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
వాషింగ్టన్: అమెరికాకు చెందని పౌరహక్కుల నేత, కాంగ్రెస్ సభ్యుడు జాన్ లూయిస్(80) ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా ఆయన ప్యాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. జాన్ అమెరికాలో ఎన్నో పౌరహక్కుల ఉద్యమాలు చేశారు. యూఎస్ ప్రతినిధుల సభలోనూ సభ్యుడికి వ్యవహరించారు. 1965లో ఆయనను అమెరికన్ పోలీసులు దారుణంగా కొట్టారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు ప్రాణాలతో బయటపడ్డ జాన్ పౌరహక్కుల ఉద్యమనేతగా ఎదిగారు. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన మృతికి అమెరికా మాజీ ప్రెసిడెంట్ […]