భై అంటే భయం అని, రవ అంటే ప్రతిధ్వని అని అర్థం. ఈ రెండు పదాలు భైరవుడి స్వభావాన్ని తెలియజేస్తాయి. కాలభైరవ సాధనలో ప్రత్యేక విషయమేమంటే సాధకుడికి భవిష్యత్లో జరగబోయే ప్రమాదాలు, చెడు పరిణామాలు, రకరకాల సమస్యల గురించి ముందుగానే తెలియజేస్తాడు. కాలభైరవుడు ఆ సాధకుడికి సాధన కాలంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వెంటే ఉండి కాపాడుతుంటాడని తంత్రశాస్త్ర విజ్ఞానం తెలియజేస్తుంది. సాధారణంగా భైరవుడు, శక్తి ఆలయాలకు కాపలాదారుడిగా వ్యవహరిస్తాడు. ఈ భైరవుడు ఎలా అవతరించాడంటే శివ […]
వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. దీనినే తెలుగులో ‘జంధ్యం’ అంటాం. యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం. యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైంది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం […]
చాంద్రమానం ప్రకారం చైత్ర, వైశాఖ మాసాల తర్వాత వచ్చే జ్యేష్ఠమాసం కూడా కొన్ని ముఖ్యమైన వ్రతాలు, పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది. పితృదేవతల రుణం తీర్చుకోవడానికి, పాపాలను పరిహరించుకోవడానికి, దైవసేవలో తరించేందుకు అవసరమైన కొన్ని పుణ్యతిథులు మనకు ఈ మాసంలోనే కనిపిస్తాయి.జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైందిగా చెబుతారు. ఈ మాసంలో తనను ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమపిండితో తయారుచేసి ఈ నెలరోజుల పాటు పూజించడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందవచ్చని […]