కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు సెలబ్రిటీలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సింగర్లు సునీత, మాళవిక కూడా కరోనా బారినపడ్డారు. అయితే తాజాగా మరో విషాధకరమైన విషయం ఏమిటంటే.. మాళవిక రెండేండ్ల కుమార్తెకు కరోనా సోకింది. దీంతో మాళవిక కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. మాళవిక తల్లిదండ్రులు కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వారంతా హోంఐసోలేషన్లో ఉండి చికిత్సపొందుతున్నారు. […]
గతేడాది విడుదలైన ‘ఖైదీ’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. విభిన్నకథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో కార్తీ హీరో నటించగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయనున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా.. కత్రీనాను హీరోయిన్గా ఎంపికచేశారట. వాస్తవానికి తమిళ మాతృకలో హీరోయిన్ పాత్ర ఉండదు. హిందీలో కొన్ని మార్పులు చేసి హీరోయిన్ పాత్రను యాడ్చేసినట్టు సమాచారం. […]
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు ఉపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. కాగా సంజయ్ మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్లనున్నట్టు సమచారం. ఆయన ప్రస్తుతం కేజీఎఫ్ 2, శమ్‌షేరా తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. సంజయ్ నటించిన కొన్ని వెబ్‌సీరిస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.