సారథి న్యూస్, చేవెళ్ల: చేవెళ్ల మండలంలోని కందవడా గేట్ సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- బీజాపూర్ ప్రధాన రహదారిపై ఇన్నోవా కారు బోర్ వెల్ లారీని ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్ లోని తాడ్ బండ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కారులో ఇరుక్కున్న శవాలు బయటికి తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.