సౌత్‌లో మంచి సినిమాలే చేసింది రకుల్ ప్రీత్ సింగ్. కొద్దికాలంగా తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ ఇప్పుడు వైష్ణవ్ తేజ్, నితిన్ తో రెండు సినిమాలకు కమిటైంది. అలాగే కోలీవుడ్ లో భారతీయుడు–2, అయాలన్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అయితే బాలీవుడ్ మరో ఆఫర్ రకుల్‌ను వరించింది. లాస్ట్ ఇయర్ అజయ్ దేవ్గన్చిత్రం ‘దేదే ప్యార్ దే’ లో నటించింది. అందులో రకుల్ గ్లామరస్ రోల్ అందరినీ మెప్పించింది. మోతాదుకు మించి గ్లామర్ ఒలకబోసింది. దీంతో […]
ముంబై: కరోనా మహమ్మారి నుంచి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కోలుకున్నారు. ఇటీవల చేసిన కరోనా పరీక్షల్లో బిగ్‌బీ అమితాబ్‌కు కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో ఆయన జులై 11న ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి కుదుటపడడంతో ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. కానీ అభిషేక్ మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.
న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ వచ్చి ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హెల్త్ వర్కర్లను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు. ‘సహజమైన తెల్లని దుస్తులు వేసుకుని, వారు సేవ చేసేందుకు అంకితం, వారు దేవుడి అవతారంలో ఉన్నారు. అహాన్ని చెరిపేసి మన సంరక్షణ స్వీకరించారు. వారు మానవత్వం జెండాను ఎగరేస్తున్నారు’ అంటూ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. కరోనా పాజిటివ్ రావడంతో అమితాబ్‌బచ్చన్, అభిషేక్ బచ్చన్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ […]
యూపీ వెళ్లేందుకు 10 బస్సుల ఏర్పాటు ముంబై: బాలీవుడ్ స్టార్ బిగ్ బీ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. యూపీకి చెందిన వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు 10 బస్సులను ఏర్పాటుచేశారు. ముంబైలోని హజీ అలీ దర్గా నుంచి శుక్రవారం ఉదయం 10 బస్సులు బయలుదేరి వెళ్లాయి. ఏబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ యాదవ్, మాహిం దర్గా ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సుహేల్ ఖండ్వానీ పచ్చజెండా ఊపి బస్సులు ప్రారంభించారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్, గోరఖ్‌పూర్, […]