న్యూఢిల్లీ: ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం పుట్‌బాల్‌లో కొనసాగుతానని భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి అన్నాడు. ఇప్పట్లో ఆటకు దూరమయ్యే ఆలోచన లేదని, మరో నాలుగేళ్లు కచ్చితంగా ఆడతాననే నమ్మకం ఉందన్నాడు. ‘ఈ తరానికి అవసరమైన ఫిట్నెస్తో ఉన్నా. ఆటపై ఆసక్తి పోలేదు. వీడ్కోలు పలకాలనే ఆలోచన కూడా లేదు. ఎవరైనా మెరుగైన ఆటగాడు వచ్చి నా గేమ్‌ను శాసిస్తే అప్పుడు ఆలోచిస్తా. అంతవరకు ఫుట్‌బాల్ ఆడడమే నాపని. 15 ఏళ్లు దేశానికి ప్రాతినిథ్యం వహించడం నేను చేసుకున్న […]