లక్నో: అంగరంగవైభవంగా జరుగాల్సిన ఆ పెండ్లి అర్ధాంతరంగా ముగిసింది. పీటలమీదే పెండ్లి కూతురు మృతిచెందింది. దీంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొన్నది. ఈ దారుణ ఘటనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కనౌజ్ జిల్లా వేదికయ్యింది. థాథియా పరిధిలోని భగత్‌పూర్వ గ్రామంలో వధువు ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుడు సంజయ్.. తన కుటుంబ సమేతంగా వధువు వనిత ఇంటికి చేరుకున్నాడు. కాగా, పెళ్లితంతు జరుగుతుండగా.. వనిత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే దవఖానకు తరలించారు. […]